లోక నాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతీ హాసన్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. తెలుగు,తమిళ,హింది భాషలలో నటించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. కెరీర్ స్టార్టింగ్‌లో శ్రుతీ హాసన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసింది. గత కొంతకాలంగా శ్రుతీ హాసన్ సినిమాలకు దూరంగా ఉంటుంది. దీనికి కారణం ఆమె ప్రేమలో ఉండటమే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రియుడితో చెట్టాల్ పట్టాల్ వేసుకుని తిరుగుతు సినిమాలు మానేసిందని ఆమెను చాలమంది విమర్శించారు కూడా.
తాజాగా ఆమె మరో అవతారం ఎత్తనుంది. శ్రుతీ హాసన్ త్వరలోనే నిర్మాతగా మారనుందని సమాచారం. మంచి కథను సిధ్దం చేసుకున్న ఓ యంగ్ దర్శకుడుతో కలిసి ఈ సినిమాను నిర్మించనుందట శ్రుతీ. శ్రుతీ నిర్మాతగా మారుందని వార్తలు రావడంతో ఆమె ఇక హీరోయిన్‌గా చూడటం కష్టం అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మరి ఇంతకి శ్రుతీ హాసన్ మనస్సులో ఏం ఉందో చూడాలి.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?