హీరోయిన్ హన్సిక అల్లు అర్జున్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో కొన్ని సినిమాలలో నటించినప్పటికి సరైన విజయాలు రాలేదు. ఇదే సమయంలో తమిళ సినిమాలలో అవకాశాలు రావడంతో అక్కడ సినిమాలలో నటించింది. తమిళ స్టార్ హీరోలతో నటించి అక్కడ స్టార్ హీరోయిన్‌గా మారింది. హన్సికతో సినిమా చేయలంటే హీరోలు సైతం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ మధ్య ఆమె నటించిన సినిమాలు సరైన విజయాలు సాధించడం లేదు. అయినప్పటికి వరుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా ఈ భామ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తన మాజీ ప్రియుడు హీరో శింబుతో కలిసి రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. గతంలో శింబుతో హన్సిక కొంతకాలం ఎఫైర్ సాగించింది. తరువాత వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో వీరు విడిపోయారు. తాజాగా వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటించనున్నారు.దర్శకుడు జమీల్ తెరకెక్కించబోయే లవ్ ఎంటర్టైనర్‌లో మాజీ ప్రియుడుతో కలిసి నటించడానికి హన్సిక ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఈ సినిమా హన్సిక కెరీర్‌లో 50వ సినిమా కావడం విశేషం. మాజీ ప్రియుడుతో హన్సిక ఎలా నటిస్తోందో చూడాలి.
- Advertisement -
మాజీ లవర్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతోందట..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -