బాలీవుడ్, హాలీవుడ్ వాళ్లు బికిని వేస్తే తెగ ఎంజాయ్ చేస్తారు, అదే తెలుగమ్మాయి బికిని వేస్తే మాత్రం అదేదో తప్పు జరిగిపోయినట్లు ఎందుకు చర్చించుకుంటురని ప్రశ్నిస్తుంది తెలుగమ్మాయి శోభిత దూళిపాల. మిస్ ఇండియా అయిన శోభిత దూళిపాల తరువాత కాలంలో హీరోయిన్‌గా మారి పలు సినిమాలలో నటించింది. గూఢచారి సినిమాతో తెలుగులో కూడా తన లక్‌ను చెక్ చేసుకుంది. సినిమా అయితే హిట్ అయింది కాని సినిమాలలో అయితే అవకాశాలు రావడం లేదు. దీంతో ఇంటర్నెషనల్ వెబ్ సిరీస్‌లలో నటిస్తుంది. ఈ మధ్య అమ్మడు సోషల్ మీడియా మీద కాస్తా ఫోకస్ పెట్టినట్లుగా అనిపిస్తోంది. తన హాట్ హాట్ అందాల ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తుంది.
తాజాగా బికిని ఫోటో ఒకటి తన పోస్ట్ చేసింది శోభిత. తెలుగమ్మాయి అయ్యిండి మరీ ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేయడం ఏంటని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఎంత స్టార్ అయినా కూడా నువ్వు తెలుగమ్మాయివి అనే విషయాన్ని మర్చి పోవద్దని సూచిస్తున్నారు. తెలుగమ్మాయి అయితే మాత్రం ఇలా పబ్లిక్‌గా అందాలను చూపించాలా అంటూ కొందరు ఆమెపై మండిపడుతున్నారు. వారందరికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది శోభిత. ఎంతో మంది స్టార్స్ గ్లామర్ ఫొటో షూట్స్ ఇస్తున్నారు. వారందరిపై తప్పుపట్టని వారు తెలుగమ్మాయి బికినీ వేయగానే ఎందుకో నోరు లేస్తుందని ఆమె ప్రశ్నించింది.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’