తెలుగు ఇండస్ట్రీలో హీరోల పారితోషకం గురించి ఎప్పటి నుంచో పెద్ద చర్చే నడుస్తుంది.సినిమా బడ్జెట్‌లో సగం భాగం హీరోల రెమ్యూనిరేషన్ కిందే పోతుంది.మహేశ్ బాబు ,ఎన్టీఆర్,ప్రభాస్ ,రామ్ చరణ్ వంటి వారు సినిమాకు 20 కోట్లుకు పైనే పారితోషకం తీసుకుంటున్నారు.అయితే హీరోల పారితోషకం ఎక్కువ అయింది అనే మాట ఇప్పటిది కాదు .ఆ కాలం హీరోల నుంచి పారితోషకం ఎక్కువుగానే ఉంది.ఎన్టీఆర్,కృష్ణ,శోభన్ బాబు,వంటి స్టార్ హీరోలు ఎక్కువుగానే పారితోషకం తీసుకునేవారు.కృష్ణ అయితే షిఫ్ట్‌ల వారిగా పారితోషకం తీసుకునేవారని తెలుస్తుంది.ఇక శోభన్ బాబు విషయానికి వస్తే… పారితోషకం విషయంలో మా అసోసియేషన్‌పైనే తిరుగుబాటు చేశారట శోభన్ బాబు.ఇప్పుడు అంటే కోట్లు ఇస్తున్నారు కాని,అప్పట్లో లక్షలే ఎక్కువ.
వీరి కాలంలో 3 లక్షల మించి ఎవరు ఎక్కువ పారితోషకం తీసుకోకూడదని మా అసోసియేషన్ రూల్ పెట్టింది.దీనిపై శోభన్ బాబు మండిపడ్డారని తెలుస్తుంది.నిర్మాతలు మేము ఇస్తామని మా వెంట పడుతుంటే వద్దనడానికి మీరెవ్వరని ప్రశ్నించడంతో ఈ నిబందనను వెనక్కి తీసుకున్నారట మా అసోసియేషన్ వారు.ఇలా సినిమాలలో వచ్చిన డబ్బుల ద్వారా భుములు కొనుగొలు చేసి బాగానే ఆస్తులను కూడపెట్టారు శోభన్ బాబు.అసలు తెలుగు ఇండస్ట్రీలో రియాల్ ఎస్టెట్ బిజినెస్‌ను మొదలు పెట్టింది కూడా శోభన్ బాబే అని అంటారు చాలామంది.ఇదే ఫార్మూలాను ఇప్పటి హీరోలు ఫాలో అవుతున్నారు.వివిధ రకాల వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతు రెండు చేతుల సంపాదిస్తున్నారు మన హీరోలు.