Wednesday, May 7, 2025
- Advertisement -

కొత్త బిజినెస్ మొద‌లుపెట్టిన‌ శ్రీరెడ్డి

- Advertisement -

టాలీవుడ్ వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి కొద్ది రోజులు సైలెంట్‌గా ఉంది. తాజాగా మ‌రోసారి శ్రీరెడ్డి మ‌ళ్లీ రెచ్చిపోతుంది. గ‌తంలో చేసిన మాదిరిగానే కామెంట్స్ చేస్తు వార్త‌ల్లో నిలిచే ప్ర‌య‌త్నం చేస్తోంది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని తెలిపి పెద్ద సంచ‌ల‌న‌మే సృష్టించింది శ్రీరెడ్డి. త‌న‌కు సినిమాల‌లో అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్ త‌న‌ను లైంగికంగా వాడుకున్నాడ‌ని చెప్పి పెను వివాదానికి తెర లేపింది. ఇక ఫిలిం చాంబ‌ర్ ఎదుట శ్రీరెడ్డి చేసిన అర్థన‌గ్న ప్ర‌ద‌ర్శ‌నను చూడ‌ని ప్రేక్ష‌కుడు లేడంటే అతిశేయోక్తి కాదు. కొద్దికాలం మీడియా కూడా శ్రీరెడ్డితో రేటింగ్స్ సంపాదించాయి.

త‌రువాత మీడియా సైతం శ్రీరెడ్డి ప‌ట్టించుకోవ‌డం మానేయ‌డం, ఇదే స‌మ‌యంలో శ్రీరెడ్డికి త‌మిళ సినిమాల‌లో అవ‌కాశాలు రావ‌డంతో మ‌కాం చైన్నైకు మార్చేసింది. కొంత‌కాలం సైలెంట్‌గా ఉన్న శ్రీరెడ్డి త‌న ఫేస్‌బుక్‌లో య‌థ‌విధిగా ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌పై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేసింది. తాజాగా ఈ భామ విమ‌ర్శ‌లు చేయ‌డానికి ఫేస్‌బుక్ స‌రిపోవ‌డం లేద‌నుకుంటా, ఏకంగా ఓ యూట్యూబ్ చానెల్‌ను పేట్టేసింది. ఇప్ప‌టికే ఫేస్ బుక్‌లో ర‌చ్చ చేస్తోన్న శ్రీరెడ్డి, ఇక యూట్యూబ్ ద్వారా ఎంత‌టి ర‌చ్చ చేస్తోందో అని ఆలోచిస్తున్నారు నెటిజ‌న్లు. అటు శ్రీరెడ్డి మాత్రం ఈ యూట్యూబ్ ద్వారా త‌నకు న‌చ్చ‌ని వాళ్ల గురించి కామెంట్స్ చేయవ‌చ్చు అనే ఆలోచ‌న చేస్తోంది. దీని ద్వారా డ‌బ్బులు కూడా సంపాదించ‌వచ్చు అనే భావ‌న‌లో ఉంది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి ఇలా యూట్యూబ్ చానెల్ పెట్ట‌డం ద్వారా కొత్త వ్యాపారం మొద‌లుపెట్టింద‌ని కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -