శ్రీరెడ్డి రెడ్డీ డైరీ
టాలీవుడ్, కోలీవుడ్ చీకటి కోనాలన్నీవెలుగుతోకి సంచలనంగా మారిన శ్రీరెడ్డి బయోపిక్..ప్రముఖుల చీకటిబాగోతాలు వెలుగులోకి..? తనను లైంగికంగా వాడుకున్న సినీ ప్రముఖుల జాతకాలను వీడియోలతో సహా ఆధారాలను “రెడ్డిడైరీ ” ద్వారా ప్రపంచానికి తెలియజేస్తానని శ్రీరెడ్డి ఈ దఫా బిగ్ బాంబ్ పేల్చారు. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ తుపాను వెలసిందని ఊపిరి పీల్చుకుంటున్న సినీపరిశ్రమకు మరో సారి షాక్ ఇచ్చింది శ్రీరెడ్డి.
టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి ప్రముఖులను టార్గెట్ చేస్తూ వారు తనను లైంగికంగా వాడుకున్నారంటూ విరుచుకుపడిన సంగతి తెలిసిందే . ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తో వార్తల్లోకెక్కింది. రెడ్డి డైరీ పేరుతో శ్రీరెడ్డి స్వీయ జీవితాన్ని తమిళంలో తెరపైకి ఎక్కించనున్నట్టు ఆ చిత్ర దర్శకుడు అల్లావుద్దీన్ చెన్నైలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
అసలే శ్రీరెడ్డి. ఎవరినీ లెక్కచేయని మనస్తత్వం. సర్వం కోల్పోయి… అన్నీ తెగించి మాట్లాడుతున్న వ్యవహారం తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు కుమారుడితో పాటు సహజ నటుడు నాని సహా పలువురు సినీ పరిశ్రమ ముఖ్యులపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
దర్శకుడు చిత్రై సెల్వం.. శ్రీరెడ్డి జీవితంపై సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘రెడ్డి డైరీ’ అనే పేరుతో ఈ సినిమా రూపొందనున్నట్లు శ్రీరెడ్డి స్వయంగా వెల్లడించింది. ఈసారి శ్రీరెడ్డి మరేం సంచలనం సృష్టిస్తుందోననే భయం తెలుగుతో పాటు తమిళ సినిమా పరిశ్రమలో ఉత్కంఠను రేపుతోంది.
అందరి భాగోతాలు బయట పెడతారా? తెలుగు, తమిళ సినీ పరిశ్రమలోని చీకటి కోణాలు, ఇక్కడ కొందరు దర్శకుడు, హీరోలు, నిర్మాతలు మహిళలను ఎలా ట్రీట్ చేస్తారు? తమ కోరికలు తీర్చుకోవడానికి వారిని ఎలా ట్రాప్ చేస్తారు, లైంగికంగా ఎలా వాడుకుంటారు అనే విషయాలు ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు చర్చించుకుంటున్నారు. రెడ్డీ డైరీ బయోపిక్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.