సూపర్ స్టార్ మహేశ్ బాబు, శృతి హాసన్ హీరో, హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన తాజా సూపర్ హిట్ చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రం రిలీజై పది రోజులు దాటినా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.
ఇప్పటికే వందకోట్లు దాటినా, ఇంకా భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా థియేటర్ల దగ్గర హౌస్‌పుల్ బోర్డ్‌లు కనిపిస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం శ్రీమంతుడు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
మొత్తం ఓవరాల్ గా 135కోట్లు ప్రపంచ వ్యాప్రంగా తెలుగు వర్షన్‌లో రాబట్టినట్లు తెలుస్తోంది.
యుఎస్ఏ: 11.8 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.5 కోట్లు, కర్ణాటక : 8.1 కోట్లు, ఇతరత్రా : 4.5 కోట్లు, ఇక నైజాం : 17.60కోట్లు, సీడెడ్ : 7.50కోట్లు, ఈస్ట్: 4.48 కోట్లు, వెస్ట్: 3.50కోట్లు, కృష్ణ: 3.50కోట్లు, వైజాగ్: 4.19 కోట్లు, గుంటూరు: 4.45 కోట్లు, నెల్లూరు: 1.5కోట్లు సాధించినట్లు సమాచారం.