Tuesday, May 6, 2025
- Advertisement -

బాలీవుడ్ ‘శ్రీమంతుడి’ గా సల్మాన్ ..?!!

- Advertisement -

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్ లో ప్రభంజనాన్నిసృష్టిస్తున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఈ సినిమాలో బాగం కాలేకపోయమనే అనుకున్న బాలీవుడ్ స్టార్ హీరోలు  ఉన్నారంటే అర్ధం చేసుకోవాలి తెలుగు సినిమా స్టామినా ఎంత పెరిగిందో.

తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాపై బాలీవుడ్ హీరోల దృష్టి పడింది. ముఖ్యంగా తెలుగు రీమేక్ లపై ఎక్కువగా మోజు పడి చేసే సల్మాన్ ఈ సినిమా చేయాలనీ భావిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో ఊరిని దత్తత తీసుకునే విషయం సినిమాకి విజయన్ని అందించింది.

ప్రస్తుతం హిందీ రీమేక్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్. హిందీ రీమేక్‌ శ్రీమంతుడు చిత్రాన్ని ఒక అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించటానికి సన్నాహాలను చేస్తుందట. ఇప్పటికే సల్మాన్ ఖాన్ మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమా ‘భజరంగీ భాయిజాన్’ సినిమా రికార్డులను తిరగరాసింది. అలాగే ‘శ్రీమంతుడు’ లాంటి సోషల్ మెసేజ్ సినిమా కండల వీరుడు చేస్తే సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని దర్శక, నిర్మతలు ఆలోచిస్తున్నారట. తెలుగులో ఘన విజయన్నిఅందుకున్న ‘శ్రీమంతుడు’ హిందీలో ఎంతటి ఘన విజయాన్ని సాదిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -