కీర్తి సురేష్ .. తెలుగు, తమిళ భాషలలో మోస్ట్ వాటెండ్ హీరోయిన్‌గా మారింది. మహనటి సినిమాతో తమిళ, తెలుగు భాషలలో టాప్ హీరోయిన్‌గా మారింది కీర్తి. అయితే కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టింది. తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. విజయ్, విక్రమ్,విశాల్,వంటి స్టార్ హీరోలతో పాటు శివకార్తికేయన్,వంటి యంగ్ హీరోలతో కూడా నటించింది కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో కీర్తి సురేష్‌కు ఓ ఇల్లును గిఫ్ట్‌గా ఇచ్చాడనే ఓ వార్త చక్కర్లు కొడుతోంది. గత కొంత కాలంగా వీరి మధ్య ఏదో తెలియని వ్యవహారం నడుస్తుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తున్నట్లు సదరు హీరో కీర్తికి ఇల్లుని గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ఇటీవలే ఓ సినిమాలో కూడా నటించారని, ఆ చనువుతోనే కీర్తికి ఇల్లును గిఫ్ట్‌గా ఇచ్చాడని సమాచారం. గతంలో కూడా ఆ హీరో ఓ హీరోయిన్‌కు ఇలాగే గిఫ్ట్‌లను ఇచ్చి కొంతకాలం ఎఫైర్ సాగించాడని తెలుస్తుంది.
గతంలో కూడా కీర్తి సురేష్‌పై ఇలాంటి వార్తలే వచ్చాయి. కీర్తి సురేష్ ఓ కమెడియన్‌తో ప్రేమలో ఉందని, అతనినే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. తరువాత కాలంలో అవి ఊట్టి గాసిప్స్ అన తేలాయి.తాజాగా మరోసారి ఇలాంటి గాసిప్స్ కీర్తిపై రావడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. మరి కీర్తి సురేష్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’