కమేడియన్ సునీల్ అందాల రాముడు సినిమాతో హీరోగా మారినప్పటికి తరువాత హాస్యనటుడిగా కొన్ని సినిమాలు చేశాడు.మర్యాద రామన్నా సినిమాతో ఫుల్ లెంగ్త్ హీరోగా మారాడు సునీల్.అతను చేసిన సినిమాల్లో మెజారిటీ ఫెయిల్ అయ్యాయి. హిట్ల కన్నా ఫ్లాపులు ఎక్కువయ్యాయి. దీంతో సునీల్‌కు హీరోగా అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి.ఇక చేసేది లేక మళ్లీ కమేడియన్‌గా తన ప్రయాణాన్నిమొదలు పెట్టాడు సునీల్.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ అరవింద సమేత సినిమాతో సునీల్ మళ్లీ కమేడియన్‌గా రీఎంట్రీ ఇస్తున్నాడు.తాజాగా తను కమేడియన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడంపై స్పందించాడు సునీల్.ఇకపై కమేడియన్‌గా అలరిస్తాననే భరోసాను ఇస్తున్నాడు సనీల్.ఇలా కమేడియన్‌గా నటించడం వల్ల ఎక్కువ సినిమాల్లో నటించడానికి అవకాశం దొరుకుతోందని.. దాని వల్ల రెమ్యూనరేషన్ రూపంలో ఎక్కువ డబ్బు కూడా వస్తోందని సునీల్ సరదాగా వ్యాఖ్యానించాడు.