హాస్యనటుడిగా ప్రేక్షకుల్ని మెప్పించిన సునీల్ హీరోగా మారిన తరువాత అనుకున్నంత సక్సెస్ కాలేదు.దీంతో మళ్లీ కామెడీ పాత్రలు చేయడానికి రెడీ అవుతున్నాడు సునీల్.కామెడీతో పాటు సినిమాలలో ఉండే కీలక పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.తన స్నేహితుడు త్రివిక్రమ్ సినిమాతో హాస్యనటుడిగా రీఎంట్రీ ఇవ్వలని చూస్తున్నాడు సునీల్. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమాలోనూ ఆయన కనిపించనున్నారని సమాచారం.
యువ కథానాయకుడు శర్వానంద్ సినిమాలోనూ సునీల్ నటిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వా కథానాయకుడిగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఈ సినిమాలో సునీల్ కూడా నటిస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా పేర్కొంది. దీనితో పాటు అల్లరి నరేష్ హీరోగా భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సునీల్ నటిస్తున్నారు.