మలయాళంలో సూపర్ హిట్ సాధించిన సినిమా టూ కంట్రీస్. ఈ సినిమాకి షఫీ దర్శకత్వం వహించారు. మలయాళంలో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి భారీ ఎత్తన ప్రయత్నాలు జరిగాయి. వెంకటేష్, రవితేజలకు ఈ సినిమా చూపించారు. ఇప్పుడు హీరోగా ఈ సినిమాలో సునీల్ సెట్ అయ్యాడు.
ఈ సినిమాకి ఎన్.శంకర్ దర్శకత్వం వహిస్తారు. వినోదాత్మకంగా సాగే సినిమా టూ కంట్రీస్. శంకర్ దేమో.. ఉద్యమాల బాట. మరి ఈ కాంబినేషన్ ఎలా కుదురుతుందో? ఈ రీమేక్ రైట్స్ బండ్ల గణేష్ దగ్గరున్నాయి. ఆయన ఈ రైట్స్‌ని మరొకరికి అమ్మేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి దర్శకుడు ఎన్.శంకర్ చాలా కాలం తర్వాత ఓ సినిమా చేస్తున్నాడు. శంకర్‌తో ఓ చిత్రం చేయాలి అని చాలా కాలంగా అనుకుంటున్నాను అని సునీల్ చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టు తనే శంకర్ కోసం సెట్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో 26న ఈ సినిమా లాంఛనంగా మొదలవుతుంది. పాటల రికార్డింగ్‌తో ఈ సినిమాకి కొబ్బరికాయ్ కొడతారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ప్రస్తుతం సునీల్ నటించిన వీడు గోల్డెహె అనే చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. క్రాంతి మాధవ్ సినిమా రెండో షెడ్యూల్ మొదలు కానుంది. జక్కన్న చిత్రం తర్వాత సునీల్ సంతకం చేసిన చిత్రం ఇదే.