గత కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో డీలా పడ్డాడు యాక్షన్ హీరో గోపిచంద్. అతను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి. దీంతో రేస్‌లో బాగా వెనుక పడ్డాడు గోపిచంద్.అర్జెంట్‌గా గోపిచంద్‌కు ఓ సాలీడ్ హిట్ పడాలి. ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సినిమా తొలి షెడ్యూల్‌లో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లో జరుపుకుంటోంది. షూటింగ్ అయితే మొదలుపెట్టారు కాని ఇప్పటి వరుకు సినిమాలో హీరోయిన్‌ను ఎంపిక చేయలేదు చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా చాలామంది పేర్లను పరిశీలించినప్పటికి చివరికి మిల్కీ బ్యూటీ తమన్నానే ఫిక్స్ చేశారట. గోపిచంద్‌తో తమన్నా ఇప్పటి వరకు కలిసి నటించలేదు. తమన్నా అయితే ఫ్రెష్‌గా ఉంటుందని భావించి ఆమెను తీసుకున్నారని తెలిపారు చిత్ర దర్శకుడు. గోపిచంద్‌తో సినిమాకు తమన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 35 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు అనిల్ సుంకర. ఈ సినిమా తనకు ఖచ్చితంగా హిట్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు గోపిచంద్.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ