మెగా స్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్మాత్మకంగా నటిస్తున్న సినిమా సైరా. భారత దేశ స్వాతంత్రద్యోమకారుడైన ఊయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్‌ను విడుదల చేశాడు చిత్ర నిర్మాత హీరో రామ్ చరణ్ తేజ్. హీరోయిన్ తమన్నా సైరా మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది.
ఈ రోజు తమన్నా పుట్టిన రోజు కావడంతో సినిమాలోని తమన్నా లుక్‌ను విడుదల చేశారు రామ్ చరణ్. తమన్నా ఈ సినిమాలో లక్ష్మీ పాత్రలో కనిపించనుంది. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తుంది. విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుధీప్ వంటి స్టార్ నటులు సైరా మూవీలో నటిస్తున్నారు. ఇక సినిమాను వేసవి బరిలో నిలపలని చూస్తున్నాడు రామ్ చరణ్.
- Advertisement -
‘సైరా’ మూవీలో తమన్నా లుక్ అదుర్స్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -