తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రముఖ తెలుగు హీరోలను టార్గెట్ చేసుకున్నట్లు అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత హైదరాబాద్ వేదికగానే తెలుగు సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సారి అంటే 2014లో ఏర్పడిన తెలంగాణ మొదటి ప్రభుత్వం హీరో నాగర్జునను టార్గెట్ చేసింది. అన్నపూర్ణ స్టూడియోకు చెందిన కొన్ని ఆస్తులను టార్గెట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం.
నాగర్జున ఆస్తులకు సంబంధించి ఓ కేసును కూడా దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. నాగర్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోలో 7 ఏకరాల భూమి ప్రభుత్వ స్థలంలో ఉందని ,దీనిని వెంటనే ప్రభుత్వనికి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో నాగర్జున కూడా ఎక్కడ తగ్గలేదు. తనకున్న పరిచియలతో ఈ కేసు నుంచి ఈజీగానే బయటపడ్డాడు నాగర్జున. తాజాగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు మరో హీరోని టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది. బాహుబలి సినిమాతో నేషనల్ లేవల్లో క్రేజ్ సంపాందించిన హీరో ప్రభాస్‌కు చెందిన గెస్ట్ హౌస్‌ను సీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. శేర్‌లింగంపల్లిలో ప్రభాస్‌కు చెందిన గెస్ట్ హౌస్ ప్రభుత్వ స్థలంలో ఉందని సీజ్ చేశారు రివెన్యూ అధికారులు. దీనిపై హైకోర్టుకు వెళ్లారు ప్రభాస్. ఆ గెస్ట్ హౌస్‌ను సక్రమంగానే కొనుగొలు చేశామని చెబుతున్నారు ప్రభాస్ తరుపున న్యాయవాది.
ఆ స్థలం వేరే వారి దగ్గరి నుంచి కొనుగొలు చేశామని , దానికి సంబంధించిన కాగితాలు కూడా హైకోర్టు ముందుంచారు ప్రభాస్. ప్రభుత్వ భూమి అయితే నా పేరు మీద ఎలా రిజస్టార్ చేశారని ప్రశ్నిస్తున్నారు ప్రభాస్. ఏది ఏమైనప్పటికి నాగర్జునకు తన స్థలం దక్కినట్లు ,ప్రభాస్‌కు తన మాత్రం స్థలం దక్కేలా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రభాస్ స్థలం ప్రభుత్వ భూమిలోనే ఉందని రికార్డులు చెబుతున్నాయాని తెలుస్తుంది. ప్రభాస్‌కు నష్ట పరిహారం చెల్లించి , ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని భావిస్తుంది. ఏది ఏమైనప్పటికి తెలంగాణ ప్రభుత్వం ఇలా హీరోల ఆస్తులను టార్గెట్ చేయడం దారుణం అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. మరి ప్రభాస్ భూ వివాదంలో ఎలాంటి ఫలితం వస్తుందో అని అందరిలోను ఆసక్తి నెలకొంది.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ