బిగ్‌బాస్ రెండో సీజన్ రోజు రోజుకి మరింత రసవత్తరంగా మారుతుంది.గత జరిగిన ఎపిసోడ్‌లలో ఇద్దరు కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌ని వదిలి బయటికి వచ్చారు.కామన్ మ్యాన్‌గా వచ్చిన నూతన్ నాయుడు ,గణేష్‌లు ఎలిమినేషన్ అయ్యారు.ఈ వారం డబల్ ఎలిమినేషన్ అంటు అందరికి షాక్ ఇచ్చిన నాని శనివారం జరిగిన ఎపిసోడ్‌లో గణేష్‌ను,ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో నూతన్ నాయుడిని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాని.ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి నూతన్ నాయుడు ఎలిమినేషన్‌పై అందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
నూతన్ నాయుడుని ఎలిమినేట్ చేయడం కొందరికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఓట్ల ప్రకారం హౌస్ నుండి గణేష్ తరువాత అమిత్ ఎలిమినేట్ కావాల్సివుంది. కానీ దీనికి భిన్నంగా నూతన్ బయటకి వెళ్లారు.దీంతో నటి మాధవీలత బిగ్ బాస్ షోపై విమర్శలు చేసింది. ”అమిత్ కి తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ.. హౌస్ లో రీఎంట్రీలు ఎక్కువగా ఇచ్చాడనే కారణంతో నూతన్ నాయుడిని ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్ గేమ్ మొదలైంది. ఇప్పటినుండి మీ ఓట్లకు పెద్ద విలువ ఉండదు. షోని చూడండి కాని ఓట్లు వేసి మీ సమయన్ని వేస్ట్ చేసుకొవద్దని హితవు పలికింది.