బిగ్‌బాస్ రెండో సీజన్‌లో శుక్రవారం జరిగిన 83వ ఎపిసోడ్ రసవత్తరంగా జరిగిందనే చెప్పాలి.శుక్రవారం ఎపిసోడ్‌లో హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ నడిచింది.’అలిసిపోతే అంతమేసఅంటు సాగిన ఈ సైకిల్ టాస్క్‌లో తనీష్, రోల్ రైడా, నూతన్ నాయుడు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. టాస్క్ జరుగుతున్న సమయంలో నూతన్ సైకిల్ చైన్ పట్టేయడం జరిగింది.దీంతో కౌశల్ ఆ చైన్‌ను సరిచేయడానికి నూతన్ దగ్గరికి వెళ్లగా,దీప్తి నూతన్ దగ్గరికి వెళ్లవద్దని వారించింది.
దీంతో కౌశల్ ,దీప్తిల మధ్య చినపాటి గొడవ జరిగింది.బిగ్‌బాస్ ఈ విషయంలో కలుగజేసుకొని చైన్ సరిచేయవచ్చని చెప్పడంతో కౌశల్ నూతన్ నాయుడి సైకిల్ చైన్ సరిచేశాడు.కానీ పదే పదే సైకిల్ చైన్ పట్టేస్తుండడంతో నూతన్ రిలాక్స్ అవ్వడానికి సమయం దొరకడంతో దీనిపై మిగిలిన ఇద్దరు కెప్టెన్ పోటీదారులు రోల్, తనీష్‌లు అభ్యతరం వ్యక్తం చేశారు.నూతన్ నాయుడికి సరైన సైకిల్ ఇవ్వకుండా బిగ్‌బాస్ తప్పుచేశారని దీంతో నూతన్ రిలాక్స్ అవుతున్నాడని తనీష్ మండిపడ్డాడు.నా కాలు సరిగా లేకపోయిన నేను గేమ్ ఆడుతుంటే బిగ్‌బాస్ నూతన్ నాయుడిని కెప్టెన్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నాడు అంటు కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకున్నాడు తనీష్.
మిగిలిన ఇద్దరు తమ టాస్క్‌ని కొనసాగించారు.రోల్ రైడా,నూతన్ నాయుడులలో ఎవరు తగ్గకపోవడంతో గేమ్ ఆసక్తికరంగా మారింది.హౌస్‌మెట్స్ మద్దతుతో గీతా నూతన్ నాయుడి దగ్గరికి వెళ్లి మీరు కెప్టెన్ అవ్వడం మాకు ఇష్టం లేదు మీరు డ్రాప్ అవ్వండని నూతన్‌ని కోరింది.దీనికి ఆయన అంగీకరించలేదు. నిర్ణీత సమయానికి ఇద్దరు సైకిల్ తొక్కుతుండటంతో ఈ వారం హౌస్‌కి కెప్టెన్ ఎవరు లేరని ప్రకటించాడు బిగ్‌బాస్.