Friday, May 2, 2025
- Advertisement -

ఈవారం థియేటర్ సినిమాలివే!

- Advertisement -

ఓ వైపు ఐపీఎల్ సీజన్ మరోవైపు థియేటర్లలో సినిమాల హంగామా వెరసీ ఎంటర్‌టైన్మెంట్ ఇష్టపడేవారికి ఈ సమ్మర్ ఖచ్చితంగా టైంపాస్. ఈ నేపథ్యంలో ఇవాళ థియేటర్‌లో రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ఓసారి చూస్తే..

సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన హారర్-కామెడీ చిత్రం ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కాబోతోంది. సిద్ధాంత్ సచ్‌దేవ్ దర్శకత్వం వహించిన ఈ హారర్-కామెడీ చిత్రంలో బాలీవుడ్ నటుడు సన్యాసి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మౌనీ రాయ్ దెయ్యం పాత్రలో నటించారు. ఆమె కేవలం కమ్మారి పురుషులనే వెంటాడే దెయ్యంగా వస్తుంది.

ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే మంచి ఆసక్తిని రేపుతున్న సినిమాల్లో కేసరి 2 . అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం బ్రిటీష్ పాలన నేపథ్యంలో రూపొందింది. జాలియన్‌వాలాబాగ్ హత్యాకాండను ఖండిస్తూ, బ్రిటీష్ రాజును కోర్టులో ఎదిరించిన భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు సి. శంకరన్ నాయర్ పాత్రలో అక్షయ్ కనిపించనున్నారు.

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన ఆధ్యాత్మిక థ్రిల్లర్ ఓదెలా 2 ఈ వారం విడుదల కానుంది. గతంలో వచ్చిన ఓడెలా రైల్వే స్టేషన్కు ఇది సీక్వెల్. ఈ సినిమాను అశోక్ తేజ తెరకెక్కించారు. ఇప్పటికే ప్రీ-సేల్ బుకింగ్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -