Friday, March 29, 2024
- Advertisement -

పెద్ద మ‌న‌స్సు చాటుకున్న టైటానిక్ హీరో

- Advertisement -

లియోనార్డో డికాప్రియో.. టైటానిక్ సినిమా హీరోగా కోట్లాది మంది భార‌తీయుల‌కు సైతం ద‌గ్గ‌రైన వ్య‌క్తి. ఇప్పుడు మ‌రోసారి డికాప్రియో.. త‌న పెద్ద మ‌న‌స్సు చాటుకున్నారు. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు తన వంతు సాయంగా 10 మిలియన్ డాలర్లు అంటే 77 కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇచ్చారు. ఉక్రెయిన్‌కు ఈ హాలీవుడ్ హీరో ఇంత విరాళం ప్రకటించడానికి వ్యక్తిగత కారణం కూడా ఉంది. ఆయన అమ్మమ్మ హెలెన్ ఇండెన్‌బిర్కెన్ ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో జన్మించారు.

అయితే 1917లో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి జర్మనీకి వలస వెళ్లింది. అక్కడే డికాప్రియో తల్లి పుట్టారు. డికాప్రియో నటించిన ప్రతి సినిమా ప్రీమియర్​కు ఆయ‌న అమ్మ‌మ్మ‌ హాజరయ్యేవారు. 93 ఏళ్ల వయసులో హెలెన్ 2008లో ఆమె మరణించారు. డికాప్రియో ఇప్పటివరకు ఆరు సార్లు ఆస్కార్​కు నామినేట్ అయ్యారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహారిస్తున్నారు.

అలెజాండ్రో గొంజాలెజ్ ఇనారిట్ తెరకెక్కించిన ‘రెవెనెంట్’లో నటనకు గానూ 2016లో ఆస్కార్ గెలుచుకున్నారు. 1998లో, 25 ఏళ్ల వయసులోనే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ‘లియోనార్డో డికాప్రియో ఫౌండేషన్​’ను స్థాపించాడు. ‘యాక్టర్ అండ్ ఎకాలజిస్ట్’​ అనే వ్యాసాన్ని చాలా ఏళ్లుగా రాస్తున్నారు డికాప్రియో. వాతావరణ విపత్తులపై పోరులో తన వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్్కు డికాప్రియా బాస‌ట నిల‌వ‌డంతో ప‌లువురు అభినందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -