Sunday, May 4, 2025
- Advertisement -

వరద బాధితుల కోసం కదిలొస్తున్న టాలీవుడ్..

- Advertisement -

తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరద బాధితుల కోసం కదిలొచ్చింది సినీ పరిశ్రమ. పలువురు ప్రముఖులు తమ వంతు సహాయం అందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా పలువురు ప్రముఖులు తమవంతు సాయం చేశారు.

డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ తెలుగు రాష్ట్రాలకు రూ.15 లక్షల చొప్పున రూ. 30 లక్షలు అందజేయగా డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్.రాధాకృష్ణ (చినబాబు), ఎస్.నాగవంశీ కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించారు.

గత కొద్దిరోజులుగా అటు ఆంధ్ర, ఇట్లు తెలంగాణ రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో సంయుక్తంగా రు. 50 లక్షలు విరాళం ప్రకటించారు.

భారీ వర్షాల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలు మమ్మల్ని ఎంతగానో కలచి వేశాయి. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మా వంతు సాయంగా చేయూత అందిస్తున్నామన్నారు. వ‌ర‌ద‌ల‌తో ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను చూసి చ‌లించిపోయిన ఎన్టీఆర్ ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వానికి రూ.50 ల‌క్ష‌లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.50 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.నిర్మాత అశ్వీనిదత్ రూ. 25 లక్షలు విరాళంగా అందజేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -