Wednesday, May 7, 2025
- Advertisement -

ట్రైలర్ టాక్ – సోగ్గాడు అదరకొట్టేసాడు !

- Advertisement -

ప్రయోగాత్మక సినిమాల విషయం లో కమర్షియల్ పంథా జోడించి హిట్ కొట్టడం నాగార్జున కి కొత్తేమీ కాదు. అలాంటి దారిలో వెళుతూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్లాప్ లు వెక్కిరించినా తన ప్రయోగాలు మార్చుకోలేదు నాగార్జున.

తాజాగా ఆయన ‘ఊపిరి’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. 

ప్రస్తుతం ఈ రెండు సినిమాలూ షూటింగ్ చివరిదశకు చేరుకున్నాయి. ఇక సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతోన్న ‘సోగ్గాడే చిన్న నాయనా’ సినిమా జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదల అయిన సోగ్గాడే చిన్ని నాయన ట్రైలర్ చాలా బాగా వచ్చింది. బాగా రొమాంటిక్ తండ్రి కి అమాయకుడైనా  కొడుకుగా రెండు పాత్రల్లో నాగార్జునే నటించాడు.

 రెండు పాత్రలూ బ్యాలన్స్ చేస్తూ నాగర్జున చేసిన నటన అదిరిపోయింది అంటున్నారు అందరూ.ఈ సంక్రాంతికి రానున్న ఈ సినిమా, పండగ సమయంలో ప్రేక్షకులు కోరుకునే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ను అందించేందుకే సిద్ధమైందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. 

{youtube}Or40avO08mE{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -