త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటి సారిగా నితిన్ అ ఆ అనే చిత్రంలో నటిస్తున్నాడు. మంచి ఫ్యామీలి సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. త్రివిక్రామ్ సినిమా అనగానే ప్రేక్షకులు మంచి వినోదం తో పాటు మంచి పంచ్ డైలాగ్స్ ఉంటాయి అని ఆశిస్తారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలో మంచి పాటలు ఉంటాయి ఈ సినిమాలో కూడా మిక్కి ఇచ్చిన సంగీతం శ్రోతన్ని బాగా ఆకట్టుకున్నాయి.
ట్రయిల్ చుసిన తరువాత ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. నితిన్ సమంత తోలి కాంబినేషన్ లో వస్తున్న అ ఆ జూన్ రెండున విడుదలవుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులనుండి యు సర్టిఫికేట్ పొందింది. సినిమాలో నితిన్ పాత్ర చాల చిన్నది అంటున్నారు. గతంలో నాని కుడా ఈగ సినిమాలో చిన్న పాత్ర చేసి మెప్పించ్చాడు. ఈ సినిమాలో కుడా నితిన్ మనల్ని ఆకరిస్తాడాని అంటున్నారు.
త్రివిక్రమ్ మార్క్ మాటలు బాగా ఉంటాయంట ఆసక్తి కలిగించే కథనం తో మరోసారి త్రివిక్రమ్ మనల్ని కట్టి పడేస్తాదంట. మొత్తనికి సెన్సార్ సభ్యుల నుండి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నా ఈ సినిమా అందరికి నాచ్చే సినిమా అవుతుందని ఆశిద్దాం.