Tuesday, May 6, 2025
- Advertisement -

ఎన్టీఆర్, పవన్ రికార్డులను బ్రేక్ చేసింది ఎవరో తెలుసా?

- Advertisement -

టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన చిత్రం అ ఆ. ఈ చిత్రం ఇప్పుడు మంచి కలెక్షన్స్ వసులు చేస్తుంది. ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల్లోకంటే యూఎస్ఏలో ఈ చిత్రం అంచనాలకు మించి భారీ వసూళ్ళు రాబడుతోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఫస్ట్ వీకెండ్‌లో (ప్రీమియర్స్‌తో సహా) యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం $ 1,704,113 (రూ. 11.40 కోట్లు) గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో.. ‘నాన్నకు ప్రేమతో’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల రికార్డులు బ్రేక్ అయ్యాయి.

ఓసారి యూఎస్ఏలో తొలివీకెండ్‌లో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాల లెక్కలు చూసుకుంటే… ‘బాహుబలి’ 4.6 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్లతో మొదటి స్థానంలో వుండగా.. ‘శ్రీమంతుడు’ 2.09 మిలియన్ డాలర్ల వసూళ్ళతో రెండో స్థానంలో వుంది. ఆ తరువాత యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ 1.635 మిలియన్ డాలర్లతో మూడోస్థానంలో.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ 1.518 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో వున్నాయి. అయితే.. ఇప్పుడు ‘అ..ఆ’ చిత్రం ఎన్టీఆర్, పవన్ సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ $ 1,704,113 కలెక్షన్లతో మూడో స్థానంలో నిలిచింది. 

అమెరికాలో లైఫ్ టైమ్ గ్రాస్ లెక్కల్ని చూసుకుంటే.. ‘నాన్నకు ప్రేమతో’ 2.02 మిలియన్ డాలర్స్, ‘అత్తారింటికి దారేది’ 1.896 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేశాయి. ‘అ..ఆ’ సినిమాకి పోటీగా రెండు వారాల వరకు మరే సినిమా లేదు కాబట్టి.. ఈ రెండు మూవీల లైఫ్‌టైమ్ గ్రాస్ కలెక్షన్స్‌కి క్రాస్ చేసి.. 2.5 మిలియన్ డాలర్ మార్క్‌ని సునాయాసంగా క్రాస్ చేస్తుందని భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -