Sunday, May 4, 2025
- Advertisement -

ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే అప్డేట్..!

- Advertisement -

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్. సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న రాజమౌళి తదుపరి సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ పై ఎనలేని క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు టీజర్లు విడుదలయ్యాయి.ఒక టీజర్ లో రామ్ చరణ్, మరో టీజర్ లో ఎన్టీఆర్ ఇరగదీశారు. యూట్యూబ్లో ఈ రెండు టీజర్లు రికార్డులు సృష్టించాయి.

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి కనిపించేలా మరో టీజర్ ను కూడా రాజమౌళి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ టీజర్ ను విడుదల చేస్తారని టాక్.కాగా ఇవాళ ఉదయం ఆర్ఆర్ఆర్ నుంచి మరో కీలక అప్ డేట్ వచ్చింది. ఈనెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ పేరుతో మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఓ ట్వీట్ చేసింది. దీంతో ఇటు నందమూరి, అటు మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

బాహుబలి మొదటి భాగం చిత్రీకరణ సమయంలో కూడా రాజమౌళి మేకింగ్ ఆఫ్ బాహుబలి పేరుతో వీడియో విడుదల చేయగా అది అప్పట్లో వైరల్ అయింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించడంతో పాటు, టాలీవుడ్ లో అగ్ర హీరోలు గా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఒకే సినిమాలో చూపించనుండడంతో ఈ మల్టీ స్టారర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబరు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -