లగ్జరీ కారులు వాడేది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఉండేవారు ఎక్కువ. ఆ ఏరియాల్లో ఉండేది రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందినవారు, ఇక వ్యాపారవేత్తలు ఉంటారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. వారివద్ద ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త కారు విడుదలైనా కొన్ని రోజుల్లోనే జూబ్లీ, బంజారాహిల్స్ ఏరియాలో కనిపించేస్తుంది. ఆ విధంగా కొత్త కొత్త కార్లు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా ఓ యువ నటుడు మంచి లగ్జరీ కారు కొన్నాడు. ఆ కారు ధర ఎంతో తెలుసా? మెర్సిడెస్ బెంజ్ GL350 కారు లగ్జరీ కారు ఇది. దీని ధర ఒక కోటి 30 లక్షలు.
ముకుందాతో తెలుగు తెరకు పరిచయమై కంచె, లోఫర్, మిస్టర్ సినిమాలు చేసి ఫిదా సినిమాతో బంపర్ హిట్ కొట్టిన మెగా కుటుంబానికి చెందిన నటుడు వరుణ్‌తేజ్. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్. ఇతడికి కార్లంటే యమ ఇష్టం. వరుసగా సినిమాలు చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తూ.. ఒక సొంత బెంజ్ కారు కొనుక్కున్నాడు. తండ్రి నాగబాబు, తల్లి పద్మజను తీసుకెళ్లి కారును ఇంటికి పట్టుకెళ్లాడు. తల్లిదండ్రులతో తన ఫేవరేట్ కారులో వరుణ్ హ్యాపీ జర్నీ చేశాడు.
అయితే ఇదో మోడల్ కార్లు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ వాడుతున్నారు. ప్రస్తుతం వరుణ్‌తేజ్ ఫిబ్రవరి 9వ తేదీన ‘తొలిప్రేమ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత రానాతో కలసి ఒక మల్టీస్టారర్‌తో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఒక్క ఫిదా సినిమాతో స్టార్ క్రేజ్ సంపాదించుకున్నాడు.