తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ మూడో సీజన్‌కు రంగం సిద్ధం అవుతోంది. గత రెండు సీజన్‌లు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ తెలుగులో మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహారించాడు.అరవింద సమేత సినిమా షూటింగ్ ఉండటం వల్ల రెండో సీజన్‌కు న్యాచురల్ స్టార్ నాని యాంకర్‌గా పని చేశాడు. అయితే రెండో సీజన్‌లో కౌశల్ ఆర్మీ దెబ్బకు హౌస్‌మెట్స్‌తో పాటు ,యాంకర్ నానిని కూడా బాగానే ట్రోల్ చేశారు కౌశల్ ఆర్మీ.
వారి దెబ్బకు మరోసారి బిగ్‌బాస్‌కు యాంకరింగ్ చేయనని తెలిపాడు నాని. మూడో సీజన్‌కు రంగం సిద్దం కావడంతో యాంకరింగ్ ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఎన్టీఆర్‌కు రాజమౌళి సినిమా ఉండటంతో రావడం కుదరదు.నాని చేయనని చెప్పాడు.విజయ్ దేవరకొండ అయితే బాగుంటుందని అతనిని అడగ్గా.. ఆ టార్చర్ నా వల కాదని చెప్పి తప్పించుకున్నాడట విజయ్ దేవరకొండ. అయితే మూడో సీజన్‌కు కొత్త పేరు తెర మీదకు వచ్చింది. ఆ పేరు మరెవ్వరిదో కాదు విక్టరీ వెంకటేష్‌ది. వెంకీ చేత మూడో సీజన్ చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు బిగ్‌బాస్ యాజమాన్యం.
బిగ్‌బాస్ రెండో సీజన్ ఫైనల్లో వెంకీ గెస్ట్‌గా వచ్చాడు. అయితే ఇప్పటివరకు ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో, టాక్ షోలలో పాల్గొన్నారే తప్ప హోస్ట్ గా ఏ షోకి పని చేయలేదు. మరి వెంకీ కనుక ఈ బిగ్‌బాస్ చేస్తే బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నట్లు అవుతుంది. అయితే వెంకీ టీవీ షోలకి యాంకరింగ్ చేస్తారా? అనేది అనుమానమే. ఈ విషయంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’