తమిళ హీరో విజయ్ సేతుపతి నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి ఎప్పటికో హీరోగా మారాడు. లేటుగా హీరోగా అయినప్పటికి తనలోని నటన ద్వారా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తమిళనాడు విజయ్ సేతుపతికి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇటీవలే ’96’ సినిమాతో మరో హిట్ కొట్టాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. విజయ్ సేతుపతి తాజాగా నటించిన సినిమా సూపర్ డీలక్స్
.
ఈ శుక్రవారం విడుదల అయిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి హిజ్రాగా నటించాడు. ఈ సినిమాలో హిజ్రా పాత్రలో విజయ్ సేతుపతి నటనకు క్రిటిక్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా మాస్టర్ పీస్ అంటూ క్రిటిక్స్ ప్రశంసించడమే కాకుండా, సేతుపతి యాక్టింగ్ స్కిల్స్‌ని తెగ అభినందిస్తున్నారు. ఇక విజయ్ సేతుపతి తెలుగులో కూడా నటిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమాలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
- Advertisement -
హిజ్రాగా ఇరగదీసిన స్టార్ హీరో..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -