పందెం కోడితో కెరీర్‌లో తొలి హిట్ అందుకున్నాడు విశాల్. తమిళ హీరో విశాల్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన నటించిన అభిమాన్యుడు సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. తాజాగా విశాల్ నటిస్తు, నిర్మిస్తున్న సినిమా పందెం కోడి-2. ఈ సినిమా తెలుగు ట్రెలర్‌ను విడుదల చేశారు.ట్రైలర్‌ను చూస్తుంటే విశాల్‌కు మరో హిట్ ఖాయంగా కనపిస్తుంది. పందెం కోడి సీక్వెల్ గా రూపొందిన ‘పందెం కోడి 2’ వచ్చేనెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది విశాల్ కి 25వ సినిమా కావడం వలన మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. “అప్పట్లో ‘పందెం కోడి’ సినిమా నేను చేసి ఉండకపోతే ఎన్టీఆర్ గానీ .. చరణ్ గాని చేసేవారు. ఎందుకంటే వాళ్లు ఈ కథ కోసం ఎంతగానో ప్రయత్నించారు. ‘పందెం కోడి హిట్ వల్లే నేను ఇప్పటికి హీరోగా చేయగల్గుతున్నాను అని తెలిపాడు విశాల్.ఈ సినిమా కూడా అందరికి నచ్చుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.