- Advertisement -
హీరో మంచు విష్ణు కెరీర్ ఒక్క హిట్ నాలుగు ప్లాప్‌లుగా సాగుతుంది.ప్రస్తుతం ఆయన ఓటర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత విష్ణు మాస్ డైరెక్టర్ వివి.వినాయక్‌తో ఓ సినిమా చేయనున్నాడని సమాచారం.వివి.వినాయక్ ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.ఈలోపు విష్ణుతో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు వినాయక్.
బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది,కాబట్టి ఈలోపు మంచు విష్ణుతో సినిమా చేయలని ప్లాన్ చేస్తున్నాడు వినాయక్.ఈ సినిమాకు విష్ణు తండ్రి సీనియర్ యాక్టర్ మోహన్ బాబు నిర్మాతగా వ్యవహిరించనున్నారు.మరి ఈ సినిమా పట్టాలు ఎక్కుతుందో లేదో చూడాలి.
https://www.youtube.com/watch?v=K5eTgTpimaY