బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన చిత్రం మణికర్ణిక. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దుమ్ములేపుతోంది. ఝాన్సీ లక్ష్మీ భాయి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గత నెల 25న విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు ఎక్కువ భాగం తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించాడు. షూటింగ్ మధ్యలో కంగనాతో గొడవ కారణంగా సినిమా నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఈ సినిమా సూపర్ హిట్ అయిన తరువాత కంగనా ప్రెస్ మీట్లు పెట్టి మరి క్రిష్‌పై విమర్శలు చేస్తోంది.
క్రిష్ కూడా ఈ విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. సినిమాకు ఎక్కువ భాగం నేనే దర్శకత్వం వహించానని కంగనా 20 శాతం మాత్రమే దర్శకత్వం వహించిందని చెబుతున్నాడు క్రిష్. అయితే క్రిష్‌కు అంత సీన్ లేదని అతని షూటింగ్ చేసిన సినిమాను మళ్లీ మేము రీషూట్ చేశామని చెబుతోంది కంగనా. ఏది ఏమైనప్పటికి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతోంది మణికర్ణిక. కంగనా నటించిన చిత్రాలలో అత్యధిక కలోక్షన్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ