Thursday, March 28, 2024
- Advertisement -

బిగ్ బాస్ హోస్ట్ విషయం లో ఎందుకింత కన్ఫ్యూషన్

- Advertisement -

బిగ్ బాస్ షో తెలుగు లో మొదలు అయినా దగ్గర నుండి అత్యంత పాపులారిటీ ని సంపాదించుకుంది. ఈ షో రేటింగ్స్ అన్ని షోలకంటే ఎక్కువ వస్తుండటం తో ఈ షో ని ఇంకా మెరుగ్గా రూపుదిద్దాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే ఈ షో కి హోస్ట్ విషయం లో ఇంకా ఒక సరైన నిర్ణయం తీసుకున్నట్టు అనిపించడం లేదు. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్న తీరు ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చింది. తర్వాతా రెండో సీజన్ కి నాని వచ్చినా అతడిని ప్రేక్షకులు అందరూ రిసీవ్ చేసుకోలేకపోయారు.

ఇక మూడో సీజన్ కి ఎన్టీఆర్ ని మళ్ళి ప్రయత్నిచినా ఆయన తిరస్కరించడం తో ఈ సారి హోస్ట్ మళ్ళి మారకుండా ఉండేలా చూసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున ల మధ్య ఒకరిని సెలెక్ట్ చేసుకొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. వెంకటేష్ అయితే ఫ్రెష్ గా ఉంటుంది, ఆయనకీ మంచి కామెడీ టైమింగ్ ఉంది కనుక వర్క్ అవుట్ ఆయె ఛాన్స్ ఉంటుంది అని ఒక వర్గం వాదన.

మరో పక్కన నాగార్జున అయితే ఆల్రెడీ మీలో ఎవరు కోటీశ్వరుడు తో మెప్పించినందున ఈజీ గా ఉంటుంది అని కొందరు వాదిస్తున్నారు. చివరికి వీళ్ళ ఇద్దరి మధ్య ఎవరు ఉంటారు అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -