తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన నటుడు శ్రీ నందమూరి తారక రామారావు. ఆయన జీవిత కథను సినిమాగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు హీరో బాలకృష్ణ నటించారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో నందమూరి హీరోలందరు నటించారు, జూనియర్ ఎన్టీఆర్ తప్ప. గతంలో బాలయ్యకు ఎన్టీఆర్‌కు మధ్య విభేదాలు ఉండటంతో తారక్‌ను ఈ సినిమాలో తీసుకోలేదని భావించారు.
అయితే ఈ లోపు ఎన్టీఆర్ తండ్రి, బాలయ్య సోదరుడైన హరికృష్ణ మరణంతో వీరి మధ్య విభేదాలు తొలిగిపోయ్యాయి.దీంతో ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్ నటిస్తాడని అందరు అనుకున్నారు. కాని ఎన్టీఆర్‌ను ఈ బయోపిక్‌లో తీసుకోలేదు బాలయ్య. అయితే ఎన్టీఆర్‌ను ఈ సినిమా తీసుకుందమానే భావించాడట బాలయ్య. కాని ఎన్టీఆర్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని, చిన్న పాత్రలో చూపిస్తే అభిమానులు నిరాశ చెందుతారనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్‌ను ఈ బయోపిక్‌లో తీసుకోలేదట బాలయ్య. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’