సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఎనర్జీని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.
సాయిలో ఈ పవరేంటి అంటూ కొశ్చన్స్ చేయడం మొదలు పెట్టారు. మెగా కాంపౌండ్ లో ఇంతకాలం ఎనర్జీ ఉన్నవాడు బన్నీనే అనుకున్నారు.
తాజా చిత్రంతో సాయి పర్ ఫార్మెన్స్ చూసాక వీడు బన్నీగాడి కంటే మూడు ఆకులు ఎక్కువే అంటున్నారు. యాక్షన్ ,డ్యాన్స్ ,పర్ ఫార్మెన్స్ లలో మనోడు దుమ్ముదులిపేశాడు. కరెక్ట్ సాంగ్ పడటం లేదుగాని పడితే గనుక బన్నీ బ్యాచ్ సాయికి సోపేస్తారేమో అన్నట్లుగా ఉంది.
చిరు,పవన్ ,నాగబాబులు సాయిధరమ్ లోని ఎనర్జీ లెవెల్స్ చూసి చాలా ఆనందపడిపోతున్నారు. తమ మేనల్లుడు ప్రయోజకుడు అయ్యాడని వారు మురిసిపోతున్నారు. సాయి పరిశ్రమకు వచ్చినటైమ్లో మనోడిని నిలబెడతానని పవన్ చెప్పిన మాట ఇపుడు నిజమైంది. అయితే అది సాయి స్వయంకృషితో సాధ్యమైందనేది స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ రివ్యూ