ఏపీ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథను యాత్ర అనే పేరుతో సినిమాగా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్‌గా మళయాళ మెగాస్టార్ మమ్మూట్టి నటించారు.గత శుక్రవారం విడుదల అయిన ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా కలెక్షన్లు కూడా బాగుండటంతో యాత్ర దర్శకుడు మహి వి. రాఘవ హ్యాపీగా ఉన్నారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతు …. సినిమాలో ఎవరు కూడా మమ్మూట్టిని చూడలేదని,అందరికి ఆయనలో వైఎస్‌గారే కనిపించారని తెలిపారు.
నాపై నమ్మకం ఉంచి, గుడ్డిగా నమ్మి రాజశేఖరరెడ్డి గారి జీవిత చరిత్రను చెప్పిన వైఎస్ జగన్ అన్నకు, ఆయన కుటుంబానికి రుణపడి ఉంటాను. యాత్ర సినిమా ఫలితం వేరేలా ఉంటే కనుక అది ఖచ్చితంగా జగన్ గారి రాజకీయ భవిష్యత్తు మీద కనిపించేదని చెప్పుకొచ్చారు. అయిన నమ్మి నాకు ఈ బాధ్యతలు అప్పగించిన వైఎస్ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -
అలా జరిగి ఉంటే జగన్ ఎక్కువుగా నష్టపోయేవారు – యాత్ర దర్శకుడు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -