ప్రముఖ ఈటీవీ ఛానెల్లో ప్రసారమయ్యే జబర్థస్త్ ప్రొగ్రామ్ ద్వారా ఫేమస్ అయ్యాడు హైపర్ ఆది. ఆది స్కిట్‌లకు అభిమానులు చాలా మందే ఉన్నారు. అతను వేసే పంచులకు జడ్జీలు సైతం ఫిదా కావల్సిందే. గత కొంతకాలం జబర్థస్త్ షోకి దూరంగా ఉంటున్న ఆది, ఇటీవలే తిరిగి షోలో కనిపిస్తున్నాడు. అయితే తాజాగా హైపర్ ఆదిపై కొందరు దాడి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…హైపర్ ఆది మొదటి నుంచి పవన్‌కు వీరాభిమానిగా ఉంటున్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా వచ్చాడు హైపర్ ఆది.
సభలో ప్రసంగిస్తున్న సమయంలో పలువురు వైసీపీ నేతలు సభలోకి దూసుకువచ్చారు. జై జగన్, జోహార్ వైఎస్ ఆర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు సమాచారం. అయితే జగన్‌పై ఆది పంచ్‌లు వేయడంతోనే వైసీపీ కార్యకర్తలు ఇలా దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆది తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ