టాలీవుడ్ యంగ్ హీరోలలో నిఖిల్ కూడా ఒకడు. విభిన్న కథలను ఎంచుకుంటు వరుస విజయాలను సాధిస్తు తన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నిఖిల్ గత రెండు సినిమాలు కూడా పెద్దగా విజయం సాధించలేదు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టలనే కసితో అర్జున్ సురవరం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా మే1న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ని మొదలుపెట్టాడు నిఖిల్.
దీనిలో భాగంగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్లో యాంకర్ అవతారమెత్తాడు నిఖిల్. సినిమా ప్రమోషన్స్ కోసం ఏకాంగా ప్రజశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్‌ను ఇంటర్య్వూ చేశాడు నిఖిల్. నిఖిల్ ఇలా యాంకర్‌గా కనిపించడానికి కారణం కూడా లేకపోలేదు. అర్జున్ సురవరం సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్‌గా కనిపించబోతున్నాడు. ఎక్కడికక్కడ అవసరం ఉన్న చోట వెళ్లి కావాల్సిన సమాచారాన్ని ఇంటర్వ్యూలను తీసుకోవడం అతని బాధ్యత.
కెఎ పాల్‌తో సినిమా ప్రచారంలో భాగంగా ఓ ముఖాముఖీ చేస్తే వైరల్ పబ్లిసిటీ దక్కుతుందనే ఆలోచనలో ఉన్నాడు నిఖిల్. ఈ సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. మరి వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందిలో ఉన్న నిఖిల్- లావణ్య త్రిపాఠికి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
- Advertisement -
కేఎపాల్‌ను ఇంటర్య్వూ చేసిన హీరో నిఖిల్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -