టాలీవుడ్‌లో బయోపిక్‌ల హడవిడి నడిస్తుంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులైన ఎన్టీఆర్,వైఎస్ఆర్ జీవిత కథల ఆధారంగా వారి బయోపిక్‌లను సినిమాగా తెరకెక్కిస్తున్నారు.ఎన్టీఆర్ రోల్‌లో ఆయన తనయుడు ,హీరో బాలకృష్ణ నటిస్తున్నారు. బయోపిక్ యాత్ర సినిమాలో వైఎస్ఆర్‌గా మాళయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.పైగా రెండు పార్టీలకు ప్రాతినిత్యం వహించిన నేతల జీవిత కథలు కావడంతో అందరి కళ్లు ఈ రెండు సినిమాలపైనే ఉన్నాయి.ఎన్టీఆయర్ బయోపిక్ సంక్రాంతికి విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
యాత్ర సినిమాను మొదట డిసెంబర్‌లోనే విడుదల చేయలని భావించారు.తరువాత ఎన్టీఆర్‌కు పోటీగా విడుదల చేయడానికి సన్నహాలు చేశారు.ఏమైందో ఏమో కారణాలు తెలియవు కాని సడన్‌గా సినిమా విడుదల తేదిని వాయిదా వేశారు.వైఎస్ బయోపిక్ ‘యాత్ర’ మూవీని ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దమయినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.దీంతో అందరు ఎన్టీఆర్ బయోపిక్‌కు బయపడి యాత్ర సినిమా వాయిదా వేసుకున్నారని అంటున్నారు.మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’