ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు తల్లిగా మారనుంది. అదేంటి టబుకు పెళ్లి కాలేదు కాదా, మరి పెళ్లి కాకుండానే తల్లిగా ఎలా మారుతుందనే కదా మీ అనుమానం. టబు తల్లిగా మారుతుంది నిజ జీవితంలో కాదు. ఓ సినిమాలో హీరోకి తల్లిగా మారుతుంది టబు. ఇంతకి టబు ఏ హీరోకి తల్లిగా నటిస్తుందో తెలుసా… మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి మీరందరికి తెలిసిందే.
ఈ సినిమాలో బన్నికి తల్లిగా టబును ఎంపిక చేశాడట త్రివిక్రమ్. కథను నచ్చడంతో వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట టబు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన టబు ఇప్పుడు బన్నికి తల్లి క్యారెక్టర్లో ఎలా నటిస్తుందో చూడాలి.ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా , బన్నికి జోడిగా పూజా హెగ్డె నటిస్తుంది. ఈ సినిమాలో తమిళనటుడు సత్యరాజ్,మలయాళ నటుడు జయరామ్,రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్, సీనియర్ నరేశ్ వంటి వారు నటిస్తున్నారు.
- Advertisement -
తల్లిగా మారిన హీరోయిన్ టబు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -