మళ్లీ బుల్లితెరపై అలరించేందుకు రెడీ అయ్యారు మాజీ మంత్రి,సినీ నటి రోజా. గతంలో ఈటీవీలో జబర్దస్త్ ప్రొగ్రాంలో అలరించిన రోజా ఆ తర్వాత మంత్రిగా ప్రమోషన్ రావడంతో బుల్లితెరకు గుడ్ బై చెప్పారు.
ఇటీవలె జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 ఒక ఎపిసోడ్లో అలరించగా తాజాగా జీ తెలుగులోనే డ్రామా జూనియర్స్ కొత్త సీజన్‌కు జడ్జిగా రానున్నట్లు తెలుస్తోంది. రోజాతో పాటు ఆమని, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ షోకి జడ్జిలుగా వ్యవహరించనున్నారు.
ఈ షో ఓపెనింగ్ ఎపిసోడ్ కి జగపతి బాబు రాగా ఆయనతో కలిసి రోజా, ఆమని డ్యాన్స్ వేసి అలరించారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.