యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది భ‌క్తులు మృతి

- Advertisement -

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 10 మంది భ‌క్తులు అక్క‌డిఅక్క‌డే ప్రాణాలు కోల్పోగా.. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. యూపీలోని పిన్హాట్-ఆగ్రాకు చెందిన కొంద‌రు భ‌క్తులు ల‌ఖ్న‌దేవి ఆల‌యాన్ని సంద‌ర్శించ‌డానికి వెళ్తున్నారు.

ఈ క్ర‌మంలోనే బద్పురా ప్రాంతంలోని కసౌవా వద్ద భ‌క్తులు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ఒక్క‌సారిగా బ్యాలెన్స్ త‌ప్పిపోయింది. దీంతో రోడ్డు పై నుంచి పక్కన కందకంలో దూసుకుపోయింది. స్థానికులు వెంట‌నే అక్క‌డికి చేరుకుని ప‌లువురిని కాపాడారు. ఈ దుర్ఘ‌ట‌న సమాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌న‌స్థలికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు.

- Advertisement -

ఈ ఘ‌ట‌న‌లో ప‌ది మంది భ‌క్తులు అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయార‌ని ఎస్‌ఎస్‌పి డాక్టర్ బ్రజేష్ కుమార్ సింగ్ తెలిపారు. వాహ‌నంలో ముప్పై మంది భ‌క్తులు ఉన్నార‌నీ, గాయ‌ప‌డ్డవారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. ఆయన ఘ‌ట‌నాస్థ‌లిని ప‌రిశీలించారు. దీనిపై కేసు న‌మోదుచేసుకున్నామ‌ని తెలిపారు. ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి గ‌ల కారణాల‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని వెల్లడించారు.

మాస్కు పెట్టుకోకుంటే రూ.1000 జరిమానా: తెలంగాణ పోలీసులు

నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే మీకు ఆ రోగాలున్న‌ట్టే?

దేశంలో కరోనా పంజా.. కొత్తగా 1.45 లక్షల కేసులు

కరోనా.. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవ్: హైదరాబాద్ పోలీసులు

ఎముక‌ల బలంకోసం వీటిని తినా‌ల్సిందే!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -