Friday, April 19, 2024
- Advertisement -

పెరుగుతున్న అలీగఢ్ క‌ల్తీమ‌ద్యం మరణాలు!

- Advertisement -

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అలీగ‌ఢ్ జిల్లాలో క‌ల్తీ మ‌ద్యం సేవించి మ‌ర‌ణించిన వారి సంఖ్య పెరుగుతుంది. ఇప్పటి కీ ఈ కేసులు సంఖ్య 35 కి చేరడంతో అక్కడ బాధితుల బంధువుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు అస్వస్థతకు గురైన 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 2 దుకాణాల్లో బాధితులు మద్యం తాగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు మద్యం దుకాణాలు సీజ్ చేసి యజమానిని అరెస్ట్ చేశారు. గుత్తేదారు సహా మరో 12మందికిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

శుక్ర‌వారం సాయంత్రానికి 15 మంది మృతిచెంద‌గా.. శుక్ర‌వారం రాత్రి నుంచి శ‌నివారం మ‌ధ్యాహ్నానికి మ‌రో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అలీగ‌ఢ్‌లోని లోధా, ఖైర్‌, జ‌వాన్ పోలీస్ స్టేష‌న్‌ల ప‌రిధిలోని వివిధ గ్రామాల్లో క‌ల్తీ మ‌ద్యం సేవించి 15 మంది ప్రాణాలు కోల్పోయార‌ని శుక్ర‌వారం ఆ జిల్లా అధికారులు ప్ర‌క‌టించారు. ఐదుగురు అబ్కారీ అధికారులను అలీగఢ్ కలెక్టర్ సస్పెండ్ చేశారు.

ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 5గురు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రభుత్వ లైసెన్స్ పొందిన దుకాణం నుండి మద్యం సరఫరా చేసి విక్రయించిన ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారని, ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్పాప్తునకు ఆదేశించినట్టు కలెక్టర్ వెల్లడించారు. కాగా, కల్లీ మ‌ద్యం త‌యారీదారులే ఈ మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు తెలిపారు.

పట్టపగలు నడి రోడ్డుపై వైద్య దంపతుల కాల్చివేత.. వీడియో వైరల్

మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ లో వింత అనుభవం!

కృష్ణపట్నంలో రాత్రి హై డ్రామా.. ఆనందయ్యను రహస్య ప్రదేశానికి తరలించిన పోలీసులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -