Wednesday, April 24, 2024
- Advertisement -

దారుణం.. 400 మంది స్కూల్ పిల్లలు కిడ్నాప్..!

- Advertisement -

నైజీరియా కాట్సినా రాష్ట్రంలోని ఓ పాఠశాలకు చెందిన 400 మంది చిన్నారులు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. ఆయుధాలు ధరించిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాలపై దాడికి పాల్పడినట్లు ఆ దేశ పత్రిక వాన్​గార్డ్ వెల్లడించింది. పాఠశాల గార్డ్స్​పై కాల్పులు జరిపారని పేర్కొంది.

కంకర గవర్న్​మెంట్ సైన్స్ సెకండరీ స్కూల్​లో శుక్రవారం ఈ దాడి జరిగింది. ఆ రోజు 800 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. అయితే ఎంతమంది కిడ్నాప్ అయ్యారు, ఎంతమంది పారిపోయి బయటపడ్డారనే విషయంపై పూర్తి స్పష్టత లేదు.

ఈ ఘటన నేపథ్యంలో పాఠశాలలను తాత్కాలికంగా మూసేయాలని కాట్సినా గవర్నర్ ఆదేశించారు. గుర్తించిన విద్యార్థులను తిరిగి సొంత ఇళ్లకు పంపించారు.ఈ దాడిని నైజీరియన్ అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ ఖండించారు. నిందితులను గుర్తించి, దర్యాప్తు ముమ్మరం చేయాలని భద్రతా దళాలకు ఆదేశాలు జారీ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -