ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం.. వలలో చిక్కిన డాల్ఫిన్ చిత్ర హింస చేశారు.. వీడియో వైరల్

- Advertisement -

మనిషి ఎంత కృర మృగంగా తయారు అవుతున్నారో అనడానికి ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. ఆడవారిపై పశువుల్లా రెచ్చిపోతు అకృత్యాలకు పాల్పడుతున్నారు. చిన్నారులు, వృద్దులు అని చూడకుండా కామంతో మృగాళ్లలా మారుతున్నారు. ఇక జీవరాశులను కూడా దారుణంగా హింసించి చంపుతున్నారు.. వాటిని టిక్ టాక్ గా చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన జరిగింది.

తమ వలలో చేపకు బదులు డాల్ఫిన్ పాపం దారుణంగా చిత్ర హింసలు పెట్టి దాన్ని వీడియో తీసి మరీ పోస్ట్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రతాప్‌గఢ్ జిల్లా కొఠారియా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శారద కెనాల్‌లో చేపల వేటకు వెళ్లారు. 

- Advertisement -

తమ వలలో పెద్ద చాప పడిందని బయటకు లాగారు.. కానీ అందులో ఐదడుగుల డాల్ఫిన్‌చూసి నిరుత్సాహానికి గురయ్యారు. ఆపై ఆగ్రహంతో దానిపై దాడి చేశారు. కర్రలు, గొడ్డలి, కత్తులతో దానిని హింసించారు. పోలీసులు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. డాల్ఫిన్‌ను చంపడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. 5 అక్టోబరు 2009లో డాల్ఫిన్‌ను ప్రభుత్వం జాతీయ జలచరంగా ప్రకటించింది.

ఇక టీవీలో దేవుడు కనిపించడు..!

వందల కొద్దీ పక్షులు మృతి.. ఎక్కువ ఎక్కడంటే..!

రైళ్ల టికెట్లపై రిఫండ్.. మీకు వచ్చిందా..!

జమ్ము కాశ్మీర్ కి కేంద్రమే నియామకాలు..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...