తమిళనాడులో మదనపల్లె తరహా సంఘటన.. దెయ్యం పట్టిందని బాలుడిని కొట్టి చంపి తిరిగి వస్తాడంటూ…!

- Advertisement -

టెక్నాలజీ పరంగా దేశం ఎంత ముందుకు వెళ్తున్న సమాజంలో మూఢ నమ్మకాలు రూపు మాపడం ఎవరివల్లా కావడం లేదు. తాజాగా తమిళనాడు లో జరిగిన సంఘటన సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఏడేళ్ల బాలుడికి దెయ్యం పట్టింది.. అంటూ కన్నతల్లే మరో ముగ్గురు మహిళలతో కలిసి కొట్టి చంపింది. తిరువన్నామలై జిల్లా అరణిలో ఈ సంఘటన జరిగింది.

ఏడాది కిందట ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో కూడా తల్లిదండ్రులు మూఢనమ్మకాలతో తమ ఇద్దరు కుమార్తెలను శూలం, డంబెల్ తో కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు మళ్ళీ తిరిగి వస్తారని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులో బాలుడు ని కొట్టి చంపిన తల్లి తన కుమారుడు మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పడం పలువురిని ఆశ్చర్యపరిచింది.

- Advertisement -

అసలేం జరిగిందంటే..కొడుకు కొంతకాలంగా మానసికంగా సరిగా లేకపోవడంతో తల్లి ఓ స్వామీజీ వద్దకు బాలుడిని తీసుకెళ్లినట్టు సమాచారం. ఆ బాలుడికి దెయ్యం పట్టిందని స్వామిజీ ఆమెతో చెప్పాడు. ఆ తర్వాత బాలుడిని ఇంటికి తీసుకు వచ్చిన మహిళ దెయ్యం పట్టిందని మూడు రోజులుగా బాలుడిని కొడుతూనే ఉంది. ఆమెతో పాటు మరో ముగ్గురు మహిళలు కలిసి బాలుడి పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు.

స్థానికుల సమాచారం అందుకుని పోలీసులు అక్కడికి చేరుకున్నా అప్పటికే బాలుడు వారు కొట్టిన దెబ్బలకు చనిపోయాడు. బాలుడి తల్లి మాత్రం తమ కుమారుడికి పట్టిన దెయ్యాన్ని వదిలించేందుకే కొట్టినట్లు చెబుతోంది. తన కుమారుడు మళ్ళీ తిరిగి వస్తాడని ఆమె చెబుతోంది.పోలీసులు మాత్రం బాలుడి తల్లి మానసిక పరిస్థితి బాగాలేదని, ఆస్పత్రిలో వైద్యం అందించిన తర్వాతే రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు.

Also Read

బ్లాక్​ఫంగస్​తో కళ్లే కాదు.. పళ్లకు కూడా ప్రమాదమే..!

థర్డ్​వేవ్​తో పిల్లలకు ప్రమాదం లేదు..! మరో అధ్యయనం

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -