Friday, March 29, 2024
- Advertisement -

అత్యాచార బాధితురాలి అబార్ష‌న్‌కు అనుమ‌తిని ఇచ్చిన మ‌ద్రాస్ హైకోర్టు..

- Advertisement -

14 ఏళ్ల ఓ అత్యాచార బాధితురాలు అబార్షన్ చేయించుకునేందుకు మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఐదు నెలల క్రితం ఆమెకు తెలిసిన ఓ వ్యక్తి చేతుల్లోనే మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. చెంగపట్టులోని బాల సంరక్షణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ మేరకు జస్టిస్ టి. రాజా ఈ తీర్పు వెలువరించారు. చెంగల్‌పెట్ మెడికల్ కాలేజ్ డీన్‌తో పాటు ఆస్పత్రి సిబ్బంది బాధితురాలికి గర్భస్రావం చేసి పిండాన్ని భద్రపర్చాలని ఆయన ఆదేశించారు.

ఐదు నెలల క్రితం తమ కుమార్తెపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడంటూ బాలిక తల్లిదండ్రులు కాంచీపురం కలెక్టర్‌ను ఆశ్రయించారు. దీంతో ఆమెను చెన్నైలోని ఓ హోమ్‌కి తరలించారు. బాలిక గర్భం కొనసాగించే అవకాశాలపై గతనెల 12న హోమ్ యాజమాన్యం చెంగల్‌పట్టు మెడికల్ కాలేజీకి లేఖ రాసింది. అయితే బాలిక ప్రాణాలకే ప్రమాదం ఉందని తేలడంతో.. అబార్షన్ చేయించుకోవాలంటూ మైనర్ బాలిక, ఆమె తల్లిని అధికారులు ఒప్పించారు. వెంటనే అబార్షన్‌కు అనుమతి ఇవ్వాలంటూ హోం యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -