కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్ ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఒక యువతి ఇంటికెళ్లి అమర్ గొడవపడిన విషయం తెలిసిందే. బొటిక్ విషయంలో జరిగిన సెటిల్ మెంట్ వివాదంలో కేసు రిజిస్టర్ అయిన దాదాపు రెండు వారాల తర్వాత కోయిలమ్మ సీరియల్ నటుడు అమర్ అలియాస్ సమీర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు అమర్ ను అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. అసలు విషయానికి వస్తే.. శ్రీవిద్య, అపర్ణ, స్వాతి అనే ముగ్గురు యువతులు కలిసి మణికొండలో బొటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో శ్రీవిద్య, అపర్ణతో స్వాతికి వివాదం చోటు చేసుకుంది. దాంతో సమీర్ తాగిన మత్తులో అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీవిద్య రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదేవిధంగా స్వాతి కూడా శ్రీవిద్యపై అదే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువురి ఫిర్యాదులో స్వీకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
వాళ్లిద్దరిలో ‘మెగా’ ఛాన్స్ ఎవరికి?
తప్పు చేస్తున్నారు.. ఎవరినీ వదిలిపెట్టం : చంద్రబాబు
సాగర్ లో సీఎం కేసిఆర్ షెడ్యూల్ ఇదే..!