సినీ నటి రాధిక కుమారస్వామికి క్రైమ్ బ్రాంచ్ నోటీసులు.. కారణం అదేనా?

- Advertisement -

శాండల్‌వుడ్ నటి రాధిక కుమారస్వామి నిన్న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ఎదుట హాజరయ్యారు.  ఓ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడికి, రాధిక మధ్య అక్రమంగా పెద్ద ఎత్తున నగదు బదిలీ అయిందన్న ఆరోపణలపై సీసీబీ అధికారులు ఆమెను ప్రశ్నించారు.  ఓ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడైన యువ‌రాజ్ అనే వ్య‌క్తి నుంచి రాధికకు రూ.60 ల‌క్ష‌లు జ‌మ అయింది. ఇప్పుడిదే ఆమె విచార‌ణ‌కు కార‌ణ‌మైంది. తన సోదరుడు రవిరాజ్‌తో కలిసి చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి చేరుకున్న రాధికను అధికారులు భారీ మొత్తంలో డ‌బ్బు జ‌మ కావ‌డంపై వివిధ కోణాల్లో ప్రశ్నించిన‌ట్టు స‌మాచారం. 

అయితే సీసీబీ దర్యాప్తునకు హాజరైన రాధిక అనంతరం మాట్లాడుతూ.. ఓ సినిమాకు సంబంధించి తన ఖాతాలో రూ. 60 లక్షలు జమ అయినట్టు చెప్పారు. ఆ  సినిమా బృందంతో ఎలాంటి ముందస్తు ఒప్పందం లేకపోవడంతో ఆ డబ్బును వెనక్కి పంపించినట్టు చెప్పారు. యువరాజ్ తనకు గత 17 ఏళ్లుగా తెలుసన్నారు. ఆయన తమ కుటుంబ జ్యోతిష్యుడని చెప్పారు. యువ‌రాజ్ త‌మ కుటుంబ జ్యోతిష్యుడ‌ని, ఆయ‌నంటే త‌న‌కు ఎంతో విశ్వాస‌మ‌ని కూడా చెప్పారు.  తన కెరియర్, జీవితం, తన తండ్రి మరణం గురించి ఆయన చెప్పినవన్నీ నిజమయ్యాయని పేర్కొన్నారు. 

- Advertisement -

కాగా, రాధికకు డ‌బ్బు పంపిన యువ‌రాజ్‌కు నేర చ‌రిత్ర ఉంది. గ‌తంలో ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప‌లువురు నిరుద్యోగుల నుంచి ల‌క్ష‌లాది రూపాయ‌లు వ‌సూలు చేసిన ఆరోప‌ణ‌ల‌పై గ‌త ఏడాది చివ‌రిలో యువ‌రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  కాగా, ఈ కేసులో ఈడీ, ఐటీ అధికారులు కూడా రాధికను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ హీరోయిన్స్ చిన్నప్పటి నుంచే సినిమాలు చేస్తున్నారు..!

దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీరే..!

మన టాలీవుడ్ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా ?

క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన సెలబ్రిటీలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -