తుపాకీ గురి పెట్టి బాలికపై ఎస్సై లైంగిక వేధింపులు!

- Advertisement -

ప్రజలకు రక్షణ గా ఉండాల్సిన పోలీస్ అధికారి తన అధికార గర్వంతో ఓ యువతిని తన తుపాకితో బెదిరించి లైంగిక దాడికి పాల్పపడ్డాడు. బాలిక తల్లి, పెద్దమ్మ ఎస్సైకి సహకరించారు. ఆ ముగ్గురిని కూడా పోలీసులు శుక్రవారం అర్సెటు చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని జరిగింది. చెన్నై కాశిమేడు పోలీసు స్టేషన్‌లో స్పెషల్‌ టీం ఎస్‌ఐ గా సతీష్‌కుమార్‌ పనిచేస్తున్నాడు. అతను ఇటీవల మాధవరంలో భద్రత విధులు నిర్వహించాడు. ఆ సమయంలో అక్కడి రేషన్‌ దుకాణం మహిళా సిబ్బందితో పరిచయం పెంచుకున్నాడు.

ఈ క్రమంలోనే తరుచూ వారి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఆ సమయంలో బాధిత యువతిపై మోజు పెంచుకున్నాడు. ఆ బాలికను లొంగదీసుకునేందుకు ఆమె తల్లి, పెద్దమ్మ సహకరించడంతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తాను చెప్పినట్టు వినకుంటే తండ్రి, తమ్ముడిని కేసుల్లో ఇరికించి జైలుకు తరలిస్తానని తుపాకీ గురిపెట్టి బెదిరించాడు.

- Advertisement -

ఆ బాలిక వెంటనే వాట్సాప్‌ ద్వారా పుళల్‌ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పథకం ప్రకారం గురువారం రాత్రి ఆ బాలిక తల్లి, పెద్దమ్మను మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి ఆ బాలిక తల్లి, పెద్దమ్మను మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన వాంగ్మూలంతో ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ను శుక్రవారం అరెస్టు చేశారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -