క్షద్రపూజల కలకలం.. వ్యక్తి మాయం.. భయాందోళనలో గ్రామస్థులు!

- Advertisement -

ప్రపంచం మొత్తం టెక్నాలజీ రంగంలో ముందుకు సాగుతుంది. విద్యా, వైద్య, సాంకేతిక రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. కానీ మనిషి మాత్రం ఇప్పటికీ మూఢ నమ్మకాలను బలంగా నమ్ముతున్నాడు. ఇప్పటికీ మంత్రాలు.. మాయలు అంటూ మోసాలు జరుగుతునే ఉన్నాయి.కొంతమంది మంత్రగాళ్ల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు దోచుకుంటున్నారు.

తెలంగాణలోని వరంగల్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. చెన్నారావు పేట మండలంలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి అదృశ్యం కావడం.. అతను నిద్రించిన మంచం పక్కన పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి కనిపించటం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. చెన్నారావు పేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో సతీష్ అనే వ్యక్తి కనిపించకుండాపోవటం తీవ్ర కలకలం రేపింది. అంతకు ముందు తన స్నేహితులతో, బంధువులతో సరదాగా గడిపిన సతీష్ ఇంటి బయట మంచం వేసుకుని నిద్రపోయాడు.

- Advertisement -

తెల్లవారే సరికి సతీష్ కనిపించకుండా పోయాడు.. దానికి తోడు అతడు పడుకున్న మంచం పక్కన ఓ ముగ్గు వేసి.. అందులో పసుపు, కుంకుమ, ఎండు మిర్చి, నిమ్మకాయలు ఉండటం గ్రాస్థులు గమనించి భయంతో వణికి పోయారు. కుంటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రకాశ్ జవదేకర్, షెకావత్ లతో సీఎం జగన్ భేటీ!

బతుకుతాం అనే ఆశ లేదు.. హంసానందిని!

పార్టీ ఎజెండాను ప్రజలే రాయాలని వైఎస్ షర్మిల పిలుపు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -