Tuesday, April 23, 2024
- Advertisement -

బాల్టిమోర్ సిటీలో ఘోర ప్రమాదం..16వ అంతస్తులో పేలుడు..!

- Advertisement -

మేరీలాండ్​ బాల్టిమోర్​ సిటీలోని ఓ భవనంలో పేలుడు సంభవించి 23 మంది కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. సహాయక చర్యలు చేపట్టి 21 మంది బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని అగ్నిమాపక సిబ్బంది అధికారులు పేర్కొన్నారు. 9 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, మిగతా వారి పరిస్థితీ విషమంగా ఉందని వెల్లడించారు.

భవనంలో ఇరుక్కుపోయిన కూలీలను సహాయక చర్యలు చేపట్టి కిటీకి నుంచి బయటకు తీసుకువచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. పేలుడు సంభవించడానికి కారణమేంటో తెలియాల్సి ఉందన్నారు.

దీనిపై స్పందించిన ఫైర్​ ఫైటర్స్​ లేబర్​ యూనియన్… బాల్టిమోర్​ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్​ కంపెనీ 16వ అంతస్తులో పేలుడు సంభవించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టాలని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -